Medchal Metro | మెట్రో సాధనకు ఉద్యమం.. 6న సుచిత్రలో మహాధర్నా: మేడ్చల్ మెట్రో సాధన సమితి
మెట్రో రైలు కారిడార్‌ను సాధించడమే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ సిద్ధం చేసింది. జనమే లేని, భవిష్యత్‌లో వస్తుందో రాదో తెలియని ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) కోసం 40 కి.మీ మెట్రో మార్గాన్ని రెండో దశ మెట్రో ప్రాజెక్టులో చేర్చారు.
Medchal Metro | సిటీబ్యూరో: మెట్రో రైలు కారిడార్‌ను సాధించడమే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ సిద్ధం చేసింది. జనమే లేని, భవిష్యత్‌లో వస్తుందో రాదో తెలియని ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) కోసం 40 కి.మీ మెట్రో మార్గాన్ని రెండో దశ మెట్రో ప్రాజెక్టులో చేర్చారు. అయితే లక్షలాది మంది నివాసముంటున్న ఉత్తర హైదరాబాద్ వైపు మెట్రో మార్గం నిర్మించకపోవడంపై మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమానికి తెరలేపింది.
ఈనెల 6న సుచిత్ర ప్రాంతంలో మహాధర్నాకు పిలుపునిచ్చింది. ప్యారడైజ్ నుంచి నాగ్‌పూర్ జాతీయ రహదారి మీదుగా మేడ్చల్ వరకు, సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి అల్వాల్, తూంకుంట మీదుగా శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు మెట్రో రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తామని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి, సర్వే పనులు చేపట్టింది.
అయితే కాంగ్రెస్ సర్కారు ఆ ప్రతిపాదించిన మెట్రో మార్గాలను రద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి తాను అనుకున్న ప్రాంతాలకే కొత్తగా మెట్రో కారిడార్లను ప్రతిపాదించడంతో పాటు వాటికే డీపీఆర్‌లను రూపొందించేలా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఉత్తర హైదరాబాద్ ప్రాంత వాసులు ఏకమై మేడ్చల్ మెట్రో సాధన సమితిగా ఏర్పాటై ‘మా ప్రాంతాలకు మెట్రో కావాలం’టూ డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర హైదరాబాద్‌ను విస్మరించారు
‘నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలను విస్మరించడం ఆమోదయోగ్యం కాదు’ అని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఉత్తర హైదరాబాద్ వైపు ఉన్న నాగ్‌పూర్ జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రతిపాదించిన మెట్రో మార్గాలను రెండోదశ ప్రాజెక్టులోనే చేర్చాలంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డిని కలిసి మెట్రో మార్గం ఏర్పాటుపై చర్చించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

