Mahatma Gandhi | సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ ): జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నేడు (గురువారం) జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. నిర్వాహకులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని సూచించారు.