కవాడిగూడ : కవాడిగూడలో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తల్తెకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు బుధవారం కవాడిగూడ డివిజన్లోని రజక కాలనీలో రూ. 6.6 లక్షలతో రజక కాలనీ నుండి మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ పైప్‌లైన్, అదే విధంగా రూ. 6.83 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ గొడిశెల రచనశ్రీ, జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్, శ్రీధర్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కవాడిగూడ డివిజన్లో శిధిలమైన తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్లను తొలగించి సమస్యలు లేకుండా దాదాపు అన్ని ప్రాంతాలలో నూతన పైప్లైన్లను ఏర్పాటు చేసి పరిష్కరిస్తున్నామని అన్నారు.
గత ఐదారారేండ్లుగా తెలుగు తల్లి ప్లెవర్ వద్ద శిధిలావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించి వెంటనే జలమండలి అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అదే విధంగా రజక కాలనీలోని ఈదమ్మ దేవాలయం వద్ద నల్లా, షెడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారం రోజుల్లో నల్లాతో పాటు షెడ్డు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, సీనియర్ నాయకులు కల్వగోపీ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఆర్. రాజేశ్, ఎస్. యాదగిరి, రాజశేఖర్ గౌడ్, రాంచందర్, జే. శ్రీహరి, జమాలోద్దీన్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఉమాకాంత్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, వేణు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.