ఉప్పల్, ఆగస్టు 16 : సాంకేతిక పరిజ్ఞానంతో సీవరేజీ సమస్యలను పరిష్కరిస్తామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాంతాపూర్‌లోని రాంరెడ్డినగర్ నుంచి ఉప్పల్ నల్లచెరువు వరకు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్‌లైన్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు.
చాలా కాలం కిందట నిర్మించిన లైన్లలో ఇబ్బందులను తొలగించేలా చూడాలని ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. కాల్ సెంటర్‌కు ప్రతి రోజూ 2వేల 500 ఫిర్యాదులు వస్తున్నాయని, అందులో 1400 కాల్స్ సీవరేజీకి సంబంధించినవే ఉంటున్నాయని జలమండలి ఎండీ చెప్పారు. ప్రాధాన్యతల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.