ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని ఆయన తెలిపారు.