Farmer | సాగు నీరు రాకుండా చేసిన కాంగ్రెస్ నేతలు.. రైతు ఆత్మహత్యాయత్నం.. వీడియో
Farmer | అసలే సాగు నీరు విడుదల చేయక, కరెంట్ కోతలతో సతమతమవుతున్న రైతన్నల పట్ల కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
Farmer | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపించే దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయని తెలిసిందే. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.. అసలే సాగు నీరు విడుదల చేయక, కరెంట్ కోతలతో సతమతమవుతున్న రైతన్నల పట్ల కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ రైతు పట్ల కర్కశంగా వ్యవహరించారు. రైతు పొలానికి సాగునీరు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సదరు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లిలో సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సమ్మిరెడ్డి చేసేదేమి లేక పొలం ఎండిపోతుందని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే సమ్మిరెడ్డి దగ్గర నుంచి కుటుంబసభ్యులు, స్థానికులు పురుగుల మందు డబ్బా లాక్కొన్నారు.
రైతు పొలానికి సాగునీరు రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లిలో సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండా అడ్డుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు
పొలం ఎండిపోతుందని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు సమ్మిరెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmer | సాగు నీరు రాకుండా చేసిన కాంగ్రెస్ నేతలు.. రైతు ఆత్మహత్యాయత్నం.. వీడియో
Father Kills Son | తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు యత్నం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి
‘రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో నల్లగొండకు ప్రథమ స్థానం తీసుకురావాలి’
తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేత
బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

