మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుటుంబ సంక్షేమ పథకం కింద మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ములకలపల్లి మండలంలోని జీపీఎస్ మంగపేట పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కోటమ్మ...
– టీఎస్‌యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం కింద చెక్కు పంపిణీ
ములకలపల్లి, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుటుంబ సంక్షేమ పథకం కింద మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ములకలపల్లి మండలంలోని జీపీఎస్ మంగపేట పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కోటమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె టీఎస్‌యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి (FWF) సభ్యురాలిగా ఉండడంతో పథకం నిబంధనల ప్రకారం మంజూరైన రూ.6 లక్షల చెక్కును సోమవారం ఆమె భర్త రామభద్రయ్యకు వారి స్వగృహంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు వివిధ కారణాలతో మృతి చెందిన 70 మంది ఉపాధ్యాయుల కుటుంబాలకు మొత్తం రూ.4.20 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.
‘అందరి కోసం ఒక్కరు.. ఒక్కరి కోసం అందరూ’ అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించామని, టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ డి.దాసు, జిల్లా కార్యదర్శి ఎస్.కె.యాకూబ్ పాషా, ములకలపల్లి మండల అధ్యక్షుడు బి.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ డి.కోట్యా, కోశాధికారి కె.శ్రీరామ్, సహాధ్యక్షులు కె.సంతోష్ కుమార్, పి.జానకీదేవి, కార్యదర్శులు కె.మల్లయ్య, కె.వెంకటేశ్వర్లు, కె.కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మృతి చెందిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
‘రజక సంక్షేమ భవన కమిటీలు రద్దు’
Farmer | సాగు నీరు రాకుండా చేసిన కాంగ్రెస్ నేతలు.. రైతు ఆత్మహత్యాయత్నం.. వీడియో
Father Kills Son | తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు యత్నం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి
‘రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో నల్లగొండకు ప్రథమ స్థానం తీసుకురావాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

