చాదర్‌ఘాట్, జూలై 5 : మలక్‌పేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. సోమవారం చాదర్‌ఘాట్‌లోని రాష్ట్రపతి గార్డెన్లో 7వ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి మేయర్ మొక్కను నాటారు. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న ఓపెన్ నాలాను పరిశీలించారు. ఎమ్మెల్యే మూసారాంబాగ్ డివిజన్లోని మూసీ ఒడ్డున ఉన్న దోబీఘాట్‌కు ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. నది ఒడ్డున పూరిగుడిసెలో నివసిస్తున్న 300 మందికి డబుల్‌బెడ్ రూం ఇండ్లను కేటాయించే విధంగా చూడాలని ఎమ్మెల్యే మేయర్ ను కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ఎంటమాలజీ విభాగం రూపొందించిన గోడపత్రికను మేయర్ , ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి, సలాం షాహీద్, ఎంఐఎం నేతలు మొహియుద్దీన్ అబ్రార్, సైఫుద్దీన్ షఫీ, డీసీ రజినీకాంత్‌రెడ్డి, ఈఈ రాధిక, డీఈ వేణుగోపాల్‌రావు, అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి మురళీధర్ పాల్గొన్నారు.