 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): విద్యార్తులల్లో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అభివృద్ది చేయడానికి ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-సీజన్ 6’ కార్యక్రమాన్ని నారాయణ స్కూల్స్ విజయవంతంగా నిర్వహించందని ఆ సంస్ధ డైరెక్టర్స్ డాక్టర్ పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణలు తెలిపారు. ఈ పోటీలను విద్యార్థులలో సమర్ధవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, విశ్లేషణాత్మక ఆలోచన, స్వీయ భావ వ్యక్తీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ పోటీ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ స్కూల్స్లలో నిర్వహిస్తూ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఎదిగిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నారాయణ క్యాంపస్లలో 100% విద్యార్థులు పొల్గొనడం ద్వారా విద్యార్తులు, ఉపాధ్యాయుల ఉత్సాహం, అంకితభావం ప్రతిబింబించాయని వివరించారు. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ జులై నుంచి అక్టోబర్ వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించామని, ప్రస్తుతం ఇతర రాష్ర్టాలలో కొనసాగుతుందన్నారు. పోటీ ద్వారా విద్యార్తులు తమ ఉచ్చారణ, స్వర నియంత్రణ, శరీర భాష, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ప్రతి విద్యార్ధిని శరీర భాష, భాషా ప్రావీణ్యం, స్వర మాడ్యులేషన్, క ంటెంట్ నాణ్యత, సృజనాత్మకత, సమయపాలన ఆధారంగా పోటీలు మార్కులు వేసి విజేతలకు మొదటి, రెండు, మూడవ బహుమతులను ప్రధాన చేసి వారి ప్రతిభను గౌరవించామన్నారు. మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ కేవలం ప్రసంగం గురించి మాత్రమే కాదని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టతను పెంచే ఒక ప్రయాణంగా డైరెక్టర్లు అభివర్ణించారు.
 
                            