మణికొండ, ఫిబ్రవరి 10: యువతుల ప్రైవేటు వీడియోలు తీయడమే కాకుండా రాజ్‌తరుణ్ భార్య లావన్యపై దాడిచేసిన ఘటనలో అరెస్టైన మస్తాన్‌సాయికి రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. మస్తాన్‌సాయిని విచారణ నిమిత్తం 5రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ నార్సింగి పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈనెల 13, 14న రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.