jewellery shop | హైదరాబాద్ నగరంలో మరో జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. మేడిపల్లిలోని క్యారెట్ లేన్ జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి షట్టర్ ధ్వంసం చేసిన దుండగులు రూ.7 కోట్ల విలువైన డైమండ్, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వరుస దొంగతనాలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిపూట గస్తీ పెంచి దొంగల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.