సికింద్రాబాద్,సెప్టెంబర్3 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని శాసన సభ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మరావుగౌడ్ అన్నారు. వారాసిగూడకు చెందిన యువ నాయకుడు ధృవ రాజ్ గౌడ్‌తో పాటు సుమారు 900 మంది యువకులు ఆదివారం సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆపార్టీ సీనియర్ నాయకులు సుంకు రాంచందర్, బొల్ల సుమిత్యాదవ్ల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు మందు వారాసిగూడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పద్మరావు గౌడ్ మాట్లాడుతూ..రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు తాము నిత్యం సేవలు అందించామని వివరించారు. ప్రజా సంక్షేమానికి పోటీ పడే నేతలకు ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు.
సికింద్రాబాద్ ప్రజలకు తాను అన్ని వేళలా అందు బాటులో ఉంటున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తీగుల్ల రామేశ్వర్‌గౌడ్, రోహిత్‌గౌడ్, పాక సాయి, శీలం సాయి, తదితరులు పాల్గొన్నారు.