Open AI CEO | చాట్జీపీతో మీ రహస్యాలు పంచుకుంటున్నారా..? : ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్
Open AI CEO | చాలామంది తమ మనసులోని బాధలు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఆందోళనలు.. ఇలా జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాట్‌జీపీటీ (ChatGPT) తో పంచుకుంటున్నారు. అయితే అలాంటి సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని భావించొద్దని ఓపెన్ఏఐ సీఈఓ (Open AI CEO) సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో చాట్ రికార్డులు చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని స్పష్టంచేశారు.
Open AI CEO : చాలామంది తమ మనసులోని బాధలు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఆందోళనలు.. ఇలా జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాట్‌జీపీటీ (ChatGPT) తో పంచుకుంటున్నారు. అయితే అలాంటి సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని భావించొద్దని ఓపెన్ఏఐ సీఈఓ (Open AI CEO) సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో చాట్ రికార్డులు చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత చాట్‌జీపీటీని థెరపిస్ట్ (Therapist), లైఫ్ కోచ్ (Life Coach) లా ఉపయోగిస్తోందన్నారు.
బంధాల్లో సమస్యలు, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత నిర్ణయాలపై ఏఐ సలహా తీసుకుంటున్నారని ఆల్ట్‌మన్ చెప్పారు. అయితే వైద్యుడు, న్యాయవాది లేదా మానసిక వైద్యుడితో మాట్లాడినప్పుడు ఉండే చట్టపరమైన గోప్యత చాట్‌జీపీటీ సంభాషణలకు ప్రస్తుతం లేదని ఆల్ట్‌మన్ తెలిపారు. ఒకవేళ కోర్టు లేదా దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా సమాచారం కోరితే.. అవసరమైన సందర్భాల్లో చాట్ రికార్డులను అందించాల్సి రావచ్చని చెప్పారు.
ఇప్పటికే అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ దాఖలు చేసిన కాపీరైట్ కేసులో ఫెడరల్ కోర్టు ఆదేశాల మేరకు ఓపెన్ఏఐ కొంత చాట్‌జీపీటీ లాగ్ డేటాను భద్రపరచాల్సి వచ్చింది. ఈ పరిణామం కూడా ఏఐ చాట్ల గోప్యతపై చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం.. నేరానికి సంబంధించిన సమాచారం, చట్టపరమైన వివాదాలకు సంబంధించిన వివరాలు లేదా దర్యాప్తులో కీలకంగా మారే అంశాలు చాట్‌జీపీటీలో ఉంటే అవి భవిష్యత్తులో ఆధారాలుగా ఉపయోగించే అవకాశం ఉంది.
అయితే దీనర్థం ఓపెన్ఏఐ ఉద్యోగులు వినియోగదారుల చాట్లను చదువుతారని కాదు. వినియోగదారులు ఎంచుకున్న ప్రైవసీ సెట్టింగులను బట్టి కొన్ని చాట్లు ఏఐ శిక్షణ, సేవల మెరుగుదల కోసం నిల్వ అయ్యే అవకాశం ఉంటుందని సంస్థ నిబంధనల్లో పేర్కొంది. వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, అధికారిక రహస్యాల వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఏ ఏఐ చాట్బాట్లోనూ పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

