Unemployees | నువ్వెట్లా చావమంటవ్.. నీకేం హక్కుంది.. రేవంత్ రెడ్డిపై నిరుద్యోగుల మండిపాటు
Unemployees | భారతదేశంలో నోటిఫికేషన్ ఇయ్యొద్దని ఉద్యమం చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నవ్. మేం 5 వేలు పోస్టులు కాదు.. 19 వేలు ఇవ్వుముంటున్నం. నువ్వేమో 5 వేలు ఇవ్వకూడదని మేం ధర్నా చేస్తున్నమని ఉల్టా మాట్లాడుతున్నవని రేవంత్ పై ఓ నిరుద్యోగి మండిపడ్డాడు.
Unemployees | పోలీస్ నియామకాలకు 5 వేల ఖాళీలకు ఇవాళ నేను నోటిఫికేషన్ ఇస్తే.. గతంలో ఇయ్యకపోతే ధర్నాలుండేవి.. ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తుర్రు.. ఇదెక్కడిదో.. మీరు ఒర్లినా, పొర్లు దండాలు పెట్టినా.. మీరు ఎండ్రిన్ తాగి బావిలో దూకినా సాధ్యం కాదు.. అంటూ పోస్టుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య మరోసారి ఆందోళన బాట పట్టారు.
ఆందోళనలో పాల్గొన్న ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. భారతదేశంలో నోటిఫికేషన్ ఇయ్యొద్దని ఉద్యమం చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నవ్. మేం 5 వేలు పోస్టులు కాదు.. 19 వేలు ఇవ్వుముంటున్నం. నువ్వేమో 5 వేలు ఇవ్వకూడదని మేం ధర్నా చేస్తున్నమని ఉల్టా మాట్లాడుతున్నవని రేవంత్ పై మండిపడ్డాడు.
30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతీసినందుకు రేవంత్ రెడ్డిని మాటలను తీవ్రంగా ఖండిస్తున్నం. తెలంగాణలో భారీ నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్. నువ్వు 5 వేలు దేనికిస్తవ్.. గత ప్రభుత్వంలో మూడు రిక్రూట్మెంట్స్ దాదాపు 40 వేల పైచిలుకు ఎస్ఐ, కానిస్టేబల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నీకు తెల్వదా మరి అని ప్రశ్నించాడు. అనవసరమైన జీవోలు తెచ్చి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలను నాశంన చేస్తున్నారు కదా.. అని మండిపడ్డాడు. అసలు మొదట ఒక జీవో తెచ్చే ప్రభుత్వ సలహాదారులను తీసేయాలి. రేవంత్ రెడ్డిని గౌడ్ చేసే ప్రభుత్వ సలహాదారులను మొదట తీసేయాలని డిమాండ్ చేశాడు.
విద్యార్థుల వల్ల, నిరుద్యోగుల వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడిందని నువ్వే చెప్పినవ్ కదా.. 5 వేలు ఇస్తే తీవ్ర పరిణామాలుంటయని రేవంత్ రెడ్డికి తెల్వదా రేవంత్ రెడ్డికి.. రాష్ట్రానికి మీరు బాస్ కాబట్టి మీ కుర్చీకి గౌరవమిస్తాం. మీరు ఎండ్రిన్ తాగండి.. బావిలో దూకండి.. ఇవేనా మీరు మాటలు మాట్లాడేది.. రాజ్యాంగంలో అందరికీ హక్కులు లేవా..? అందుకే మేం కేసులు పెట్టేందుకు సరూర్ నగర్ పీఎస్ పోతం. ఎక్కడో మారుమూల గ్రామాలు, పల్లెలు, గిరిజన తాండాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వస్తే 30 లక్షల మంది మనోభావాలను దెబ్బతీసిండు. వాళ్ల తల్లిదండ్రులే చావమనలేదు.. హాస్టల్ ఫీజులు, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకుని చదువుకుంటుంటే నువ్వెట్లా చావమంటవ్. నీకేం హక్కుందని అని ఫైర్ అయ్యాడు.
రేవంత్ రెడ్డి 30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలు దెబ్బ తీసాడు
గత ప్రభుత్వంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు నియమిస్తే..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5వేల నోటిఫికేషన్లు వేయడం ఏంటి?
ఇంత కష్టపడి చదువుతున్న నిరుద్యోగులను రేవంత్ రెడ్డి చావమని అంటాడా?
అందుకే మేము రేవంత్ రెడ్డి మీద… https://t.co/bM0k6nyomL pic.twitter.com/U3OMUM7RZ3
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
Read Also :
CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

