మైనర్ల ట్రాప్ కేసులో భారీ మోసాలు
మైనర్ల ట్రాప్ కేసులో భారీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహి ల్స్ ఇస్టాగ్రామ్ కేసులో మొత్తం 11మందిని నిందితులుగా గుర్తించారు. 5 రోజుల పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే కస్టడీ సమయా న్ని పొడిగించాలని కోర్టును కోరా రు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 14 (నమస్తే తెలంగాణ) : మైనర్ల ట్రాప్ కేసులో భారీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహి ల్స్ ఇస్టాగ్రామ్ కేసులో మొత్తం 11మందిని నిందితులుగా గుర్తించారు. 5 రోజుల పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే కస్టడీ సమయా న్ని పొడిగించాలని కోర్టును కోరా రు. 5 రోజుల పోలీసు కస్టడీలో పూర్తిస్థాయి సమాచారం ఇచ్చేందుకు ప్రధాన నిందితుడు అర్జున్ సహకరించలేదని మరో 10రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి గురువారం ఆదేశాలు జారీ చేశారు.
కౌంటర్ దాఖలుకు నిందితుల తరఫు న్యాయవాది సమ యం కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మైనర్లను ట్రాప్ చేసి భారీ మొత్తం లో డబ్బులు వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి దాకా పలు సందర్భాల్లో మైనర్ బాధితురాలిపై లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడినట్టు వెల్లడైందన్నారు. మూడు నెలల్లోపు వివిధ కారణాలు చెప్పి బాధితురాలి నుంచి 13లక్షలు అర్జున్ తీసుకున్నట్టు తెలిసిందన్నారు. తండ్రికి తెలియకుండా కబ్బోర్డునుంచి లక్షల రూపాయలు తీసుకుని అర్జున్‌కు అందించినట్టు బయటపడింది. అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు 25మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

