Fire Crackers | పటాకుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం.. వీడియో
అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో (Fire Crackers) ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Fire Crackers | అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో (Fire Crackers) ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పటాకుల మోతతో ప్రజలు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న హోటల్‌కు వ్యాప్తి చెంది ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. సుల్తాన్‌బజార్ డివిజన్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి,అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైరింజన్లతో గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణం ఎదురుగా ఉన్న పది వాహనాలు కాలి బూడిదయ్యాయి.
బషీర్‌బాగ్‌కు చెందిన గుర్విందర్ సింగ్ అనే వ్యాపారి హనుమాన్ టెక్డీలో పారస్ ఫైర్వర్క్స్ దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చారు. అందరూ కొనుగోళ్లలో ఉండగా, దుకాణంలో ఒక్కసారిగా పటాసులు ఒకదాని వెంట ఒకటి పేలాయి. భారీ శబ్ధాలు చేస్తూ క్షణాల్లో టపాసులకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కొనుగోలుదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
గాయపడ్డ మహిళ..
మంటలు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌కు వ్యాపించడంతో లోపల సామగ్రి కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుకాణంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పది వరకు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఐదు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. బయటి నుంచి నిప్పు రవ్వలు వచ్చి దుకాణంలో పడటంతో మంటలు అంటుకున్నట్లు దుకాణంలో పని చేసే సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా టపాసుల దుకాణానికి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు.
అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు pic.twitter.com/ujClAOEbiY
— Prashanth (@itzmibadboi) October 27, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

