e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home హైదరాబాద్‌ స్వీయ రక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ దోహదం

స్వీయ రక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ దోహదం

చాదర్‌ఘాట్‌, జూలై 26 : స్వీయ రక్షణ కో సం మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి శిక్షణ ఎంతో దోహదపడుతాయని సుప్రీం మార్షల్‌ ఆర్ట్స్‌ స్టార్‌, పాకో చైర్మన్‌, హీరో డాక్టర్‌ సుమన్‌ తల్వార్‌ అన్నారు. పాకో మార్షల్‌ ఆర్ట్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థుల బెల్ట్‌ గ్రేడింగ్‌ కార్యక్రమానికి సుమన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణ అనేది సొంత బలంతో తనను తాను రక్షించుకునే పద్ధతి అని పేర్కొన్నారు. మహిళలు ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం చాలా అవసరమన్నారు. పాకో మార్షల్‌ ఆర్ట్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ జాతీయ బ్రాంచ్‌ చీఫ్‌ సయ్యద్‌ ఇఫ్తేకార్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ తమ అకాడమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్స్‌ను సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్‌ ఇఫ్తేకార్‌ హుస్సేన్‌కు బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌-2 డిగ్రీ, ఫరీదా సుల్తానా, సయ్యద్‌ తాహీద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ మహ్మద్‌ హుస్సేన్‌-1 డాన్‌ డిగ్రీని బహుకరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana