బంజారాహిల్స్, జనవరి 25: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతోపాటు ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి వివాహిత తనలో సగం వయసు కలిగిన యువకుడితో అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఆర్తిదేవి పాశ్వాన్(46)కి 2003లో సురేష్ పాశ్వాన్‌తో ప్రేమ వివాహం జరిగింది.
వారిద్దరూ 2004నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం 47లోని ఓ వ్యాపారి ఇంట్లో వంట మనుషులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరికి కొడుకు(19), కుమార్తె(16) ఉన్నారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాన్సువాడ సమీపంలోని పోచారం తండాకు చెందిన మూన్ శ్రీధర్(23) అనే యువకుడు ఇటీవల ఆర్తిదేవి పాశ్వాన్ పనిచేస్తున్న ఇంట్లోనే వాచ్‌మెన్‌గా చేరాడు. కాగా ఈనెల 19న తాను ఊరెళ్తున్నానని యజమానికి చెప్పి శ్రీధర్ వెళ్లిపోయాడు. ఈనెల 23న మార్కెట్‌కు వెళ్తున్నానని ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆర్తిదేవి తిరిగి రాలేదు. రాత్రయినా ఆమె తిరిగి రాకపోవడంతో భర్త ఫోన్ చేసినా స్పందించలేదు.
బంధువులు, స్నేహితుల ఇంట్లో వాకబు చేయగా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాగా గత కొంతకాలంగా శ్రీధర్‌తో సన్నిహితంగా ఉన్న తన భార్య ఆర్తిదేవి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అతడితో కలిసి వెళ్లిపోయిందని భర్త సురేష్ పాశ్వాన్ శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.