అడ్డగుట్ట, ఆగస్టు 24 : వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ ఘట న తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథ నం ప్రకారం… కాచిగూడ ప్రాంతానికి చెందిన పి. దివ్య (31), వికాస్‌లకు 2015లో వి వాహమైంది. అయితే వారికి పిల్లలు కలుగకపోవడంతో ఈస్ట్ మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా దివ్య చికిత్స తీసుకుంటుంది. ఆమెకు సిస్ట్ ఆపరేషన్ చేయాలని గైనకాలజిస్ట్లు సూచించడంతో దివ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
సోమవారం ఉదయం ఆపరేషన్ థి యేటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు కాసేపటికి హడావిడి సృష్టించారు. కొంత సమయానికి పేషెంట్‌కు రక్తం అవసరమని భర్త వికాస్‌కు చెప్పడంతో అత ను బంధువులు, స్నేహితుల సహకారంతో 6 యూనిట్ల రక్తం సమకూర్చా డు.

అయినా తీవ్రరక్తస్రావంతో కార్డియాక్ అరస్టై దివ్య చనపోయినట్లు వైద్యులు హడవిడిగా చెప్పి అక్కడి ను ండి బయటపడ్డారు. ఆపరేషన్ చేసిన వైద్యులు తమకు కావాలని, ఆరోగ్యవంతంగా ఉన్న మహిళ ఎలా చనిపోతుందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివ్య మృతికి కారకులైన వైద్యులను ఆసుపత్రికి రప్పించాలని డిమాండ్ చేస్తూ ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆసుపత్రికి చేరుకొని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితులకు తగిన న్యాయం చేసి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపాలపురం ఏసీపీ యాదగిరిరెడ్డి, తుకారాంగేట్ సీఐ బషీర్ అహ్మద్‌లకు సూచించారు. కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.