కొండాపూర్, జూన్ 19 : అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త, మరిది వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈస్ట్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజయ్య కుమార్తె బి.సుష్మ(27)ను నేరేడ్ చెందిన గొల్లూరు ఆనంద్ అమృత్ ఇచ్చి 2025 జనవరి 31న పెండ్లి చేశారు. పెండ్లి సమయంలో కట్నం కింద ఆరు తులాల బంగారం, ఒక బుల్లె ట్ రూ. 5.5 లక్షలు ఇచ్చారు.
అమృత్ ఓ కంపెనీలో సాఫ్ట్ చేస్తుండగా, సుష్మ మాదాపూర్ ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ చేస్తున్నది. గత కొద్ది రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలని సుష్మను భర్త అత్తమామ లు ఆనంద్ పాలిన, మరిది జ్యోతిరాజ్ గురిచేస్తున్నారు. కట్నం విషయమై సుష్మకు అత్తమామలతో గొడవలు జరిగాయి. ఇటీవల సుష్మకు ఆరోగ్యం బాగలేకపోవడంతో గత శని, ఆదివారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సోమవారం అడ్డగుట్టలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 18న సాయంత్రం 3 గంటలకు ఆఫీస్ వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పిన సుష్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.
ఆఫీస్ వెళ్లిన సుష్మ .. రాత్రి 8. 30 గంటలకు బయటకు వెళ్లి కేబుల్ మీదకు చేరుకొని దుర్గం చెరువులోకి దూకింది. ఆఫీస్ వెళ్లిన సుష్మ రాత్రి1 గంటకు ఇంటికి చేరాల్సి ఉన్నా, రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సుష్మ పనిచేస్తున్న ఆఫీస్ కాల్ అడుగగా ఆమె రాత్రి 8.30 గంటలకే ఆఫీస్ బయటకు వెళ్లిందని తెలిపాడు. దీంతో తెలిసిన వారిని, బంధువులను ఆరా తీయగా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో గురువారం తెల్లవారుజామున మాదాపూర్ ఫిర్యాదు చేశారు.
ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువు నీటిపై యువతి మృతదేహం తేలియాడుతుండడంతో స్థానికులు గమనించి మాదాపూర్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ సహాయంతో యువతి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి చూడగా, ఆమె మిస్సింగ్ సుష్మగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఉస్మానియాకు తరలించారు. మృ తురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మే రకు సుష్మ భర్త అమృత్ అత్తమామలు ఆనంద్, మరిది జ్యోతిరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.