ఖైరతాబాద్, జూలై 7 : గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయానికి యత్నించిన ఓ వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పంజాగుట్టలోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న సయ్యద్ రంజాన్ అలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట దాచేపల్లి చెందిన దాదు అనే వ్యక్తి ద్వారా గంజాయి సేకరించి అవసరమైన వారికి విక్రయిస్తుంటాడు.
అదే క్రమంలో పంజాగుట్ట మెట్రో పిల్లర్ 1087 వద్దా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయానికి యూత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు సయ్యద్ రంజాన్ అలీని అదుపులోకి తీసుకొని 450 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాదు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.