సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్(South Central Railway Zone) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనుల వల్ల పలు రైలు మార్గాలలో ఆరు రైళ్లను రద్దు చేస్తూ(Trains cancelled) సోమవారం రైల్వే అధికారులు తెలిపారు. మిరాజ్-పార్లీ, కల్హాపూర్-నాగ్‌పూర్, కోల్హాపూర్-దనబాద్ వంటి రైల్వే స్టేషన్ల మధ్యలో ఆరు రైళ్లను రద్దు చేశామన్నారు. ఈ నెల 26 నుంచి జనవరి 5 వరకు(December 26 to January 5) టైమ్‌టేబుల్ వారీగా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామన్నారు.