చంపాపేట, జూన్ 18 : బహుజన సమాజ్ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జిగా చంపాపేటకు చెందిన మంత్రి జగన్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి రవికుమార్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు కొల్లాటి రాములు జగన్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగన్ మాట్లాడుతూ పార్టీ జిల్లా బాధ్యులు తమపై ఎంతో నమ్మకంతో తనను ఎల్బీనగర్ ఇన్చార్జిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పజెప్పడానికి సహకరించిన పార్టీ పై నాయకత్వం, ప్రముఖ నేతలు, జిల్లా బాధ్యులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీకి ఎలాంటి నమ్మక ద్రోహం చేయకుండా పార్టీలో ముందుకు సాగుతానన్నారు.