కాచిగూడ,నవంబర్ 19 : పట్టాల పక్కన నడుచుకుంటు వెలుతుండగా వందేభారత్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ హెడ్‌కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాలు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి(55)మంగళవారం అర్ధరాత్రి ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన నడుచుకుంటు వెలుతుండగా వందేభారత్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై ఆకుపచ్చ రంగు ఫూలచొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 9948695948 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.