చాంద్రాయణగుట్ట, నవంబర్ 27: అప్పు ఇవ్వలేదని దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చాంద్రాయణగుట్ట పరిధిలో జరిగింది. గురువారం ఏసీపీ ఏ.సుధాకర్, ఇన్స్‌స్పెక్టర్ ఆర్ గోపీ తెలిపిన వివరాల ప్రకారం.. చాం ద్రాయణగుట్ట కేశవగిరిలో నివసించే వాజీద్‌ఖాన్ ఝ(27),బార్కాస్‌లో నివసించే మహసీన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ (35) ఇద్దరు పాత పరిచయస్తులు.ఈ నెల 25వ తేదీన వాజీద్‌ఖాన్ పని ముగించుకొని ఇంటికి వె ళ్తుండగా చాంద్రాయణగుట్టలో మహసీన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ తారస పడ్డాడు.
పాత పరిచయం కారణంగా తనకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వాలని కోరాడు. తన దగ్గర డబ్బులు లేవని వాజీద్‌ఖాన్ చెప్పినప్పటికీ వినకుండా నేను అడిగితే డబ్బులు లేవం టావా అంటూ మహమ్మద్ సుల్తాన్ వాజీద్ఖాన్పై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న కత్తితో వాజీద్‌ఖాన్ తలపై బలంగా దాడి చేశాడు. స్థానికులు 100 డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వాజీద్ఖాన్ను ఉస్మానియాలో చేర్పించారు.
చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన వాజీద్ఖాన్కు తిరిగి ఈ నెల 26వ వ తేదీన ఆరోగ్యం బాగోలేదని ఉస్మానియా వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం వాజీద్‌ఖాన్ మరణానికి కారణమైన మహమ్మద్ సుల్తాన్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నిందితుడిపై 19 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో నిందితుడిని పీడీ యాక్ట్‌పై జైలుకు కూడా పంపించారు. ఆకారణంగా దాడి చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.