నేరేడ్మెట్, ఏప్రిల్ 17 : చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి వినాయకనగర్ డివిజన్లోని బండ చెరువు, రామకృష్ణాపురం చెరువులను ఆయన పరిశీలించారు. ఈ మేరకు చెరువుల సుందరీకరణ, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. మల్కాజిగిరి నియోజకవర్గంలోని చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే సఫిల్‌గూడ చెరువు, బండ చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులు జరుగుతున్నాయని అన్నారు. దోమలు నివారణకు డ్రోన్లతో మందును పిచికారి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి కాలనీలో విడతలవారీగా ప్రతి రోజు సాయింత్రం ఫాగింగ్ చేస్తున్నామని తెలిపా రు. చెరువులను సుందరీకరించడానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలోని చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెప్పా రు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు, అన్ని సౌకర్యాలు సమకూర్చి చెరువును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, ప్రేమ్‌కుమార్, డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, ప్రాజెక్టు సీఈ సురేశ్, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, డీఈ పవన్, వాటర్‌వర్క్స్ జీఎం సునీల్ కుమార్, డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ లౌక్య, ఏఈ సత్యలక్ష్మి, అధికార ప్రతినిధి సతీశ్‌కుమార్, సర్కిల్ అధ్యక్షు డు పిట్టల శ్రీని వాస్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, సంతోశ్ రాందాస్, మోహన్ రెడ్డి, సూరి, ఎస్ఆర్ ప్రసాద్, ఉపేం దర్‌రెడ్డి, చెన్నారెడ్డి, మహేశ్, రాజు, పాపిరెడ్డి, సత్తయ్య, సత్యమూర్తి, భాగ్యానంద్‌రావు, బాబు, బాలకృష్ణగుప్తా, బాలరాజుయాదవ్, సత్యనారాయణ, మహేశ్ పాల్గొన్నారు.