మైలార్దేవ్పల్లి, జూలై 3: ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. దిల్సుఖ్నగర్కు చెందిన సుదర్శన్ తన కారులో మైలార్దేవ్పల్లి నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తున్నాడు.
మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్లో కారులో పెట్రోల్ పోసుకొని వెళ్తున్న క్రమంలో కారులోని ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.