ప్రభుత్వ భవనాల ఆధునీకరణ
ప్రభుత్వ వ్యాపార భవనాల ఆధునీకరణ పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ చేపట్టింది. నగరంలోనే అత్యంత కీలక ప్రాంతమైన అమీర్‌పేటలో హెచ్ఎండీఏకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు భారీ బహుళ అంతస్థుల వ్యాపారాలు ఉన్నాయి.
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ
- మైత్రీ వనం, స్వర్ణ జయంతి కమర్షియల్
- కాంప్లెక్సుల ఆధునీకరణకు ప్రణాళికలు
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వ్యాపార భవనాల ఆధునీకరణ పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ చేపట్టింది. నగరంలోనే అత్యంత కీలక ప్రాంతమైన అమీర్‌పేటలో హెచ్ఎండీఏకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు భారీ బహుళ అంతస్థుల వ్యాపారాలు ఉన్నాయి. మైత్రీవనం, మైత్రీ విహార్‌తో పాటు స్వర్ణ జయంతి కమర్షియల్ కాంపెక్ల్సు పేరుతో మూడు వ్యాపార భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ వ్యాపార కార్యకలాపాలకే హెచ్ఎండీఏ అద్దెకు ఇస్తున్నది. ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా ఉన్న ఈ భవనాలను ఆధునీకరించి, మరింత ఆదాయాన్ని పెంచుకునే చర్యలు అధికారులు చేపట్టారు.
కరోనాతో చాలా రోజులుగా ఈ భవనాల్లో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎక్కువగా ఐటీ శిక్షణ సంస్థలు, ఇతర కార్యాలయాలు ఉండడంతో వాటిని ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం వీటిని ఆధునీకరించి అద్దెకు ఇవ్వడం ద్వారా అద్దెల రూపంలో వచ్చే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమీర్‌పేట ప్రాంతంలో వ్యాపార పరంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ హెచ్ఎండీఏకు చెందిన వ్యాపార భవనాల్లో స్థలాన్ని అద్దెకు తీసుకునేందుకు ముందుకు వస్తున్నా, అవి ఆధునికంగా లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు మొదట అమీర్‌పేటలోని మైత్రీవనం, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్సులను ఆధునీకరించేందుకు సుమారు రూ. 85 లక్షలు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. రెండు వ్యాపార భవనాల్లో ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేసి, అద్దెకు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

