Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Mercedes Benz | అత్యాధునిక సాంకేతికత, అసమానమైన లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌పై కస్టమర్లకు ఉన్నఅపారమైన నమ్మకానికి ఒకేరోజు 50 కార్ల డెలివరీ చేయడమే నిదర్శనమని మహావీర్ మోటార్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Mercedes Benz | హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా లగ్జరీ కార్ల ప్రియుల కలలను నిజం చేస్తూ.. మహావీర్ మోటార్స్ ‘దసరా డ్రీమ్ డేస్’ పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఒకేసారి ఏకంగా 50 మంది కస్టమర్లకు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ కార్లను డెలివరీ చేసి వారి ఇళ్లలో పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
కొండాపూర్‌లోని మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మహావీర్ గ్రూప్ చైర్మన్ యశ్వంత్ ఝబఖ్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఝబఖ్, సీఈవో నితిన్ కుమార్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు వినియోగదారులకు స్వయంగా కార్ల తాళాలను అందజేశారు. కొత్త ఆరంభాలు, సంపద వృద్ధికి ప్రతీకగా జరుపుకునే దసరా పర్వదినాన కస్టమర్ల లగ్జరీ కారు కలను సాకారం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికత, అసమానమైన లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌పై కస్టమర్లకు ఉన్నఅపారమైన నమ్మకానికి ఒకేరోజు 50 కార్ల డెలివరీ చేయడమే నిదర్శనమని మహావీర్ మోటార్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం కార్ల విక్రయం మాత్రమే కాదని, కస్టమర్లతో బ్రాండ్‌కు ఉన్న బంధాన్ని మరింత బలపరిచే మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు.
ఈ పండుగ సీజన్లో మరింత మంది కస్టమర్లకు అత్యుత్తమ యాజమాన్య అనుభూతిని అందిస్తూ, తమ బెంజ్ కుటుంబంలోకి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు.
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

