హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.
అనంతరం అంబారీ పై అమ్మవారి ఊరేగింపు ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. పోతురాజుల నృత్యాలు, మహిళల కోలాటం ప్రదర్శన, డప్పు చప్పుళ్లతో అంబారీ ఊరేగింపు కు ముందు సాగారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.