కాచిగూడ, ఆగస్టు 31: రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధనోత్సవాలు గురువారం కాచిగూడ లింగంపల్లిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరాధనోత్సవాల సందర్భంగా సుప్రభాతం, అష్టోత్తరం, పంచామృత, మధు అభిషేకం, అలంకార అష్టోత్తరం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సంధర్భంగా మఠంలో పూజలతో విద్యుత్ దీపాలతో వైభవంగా అలంకరించారు. ఈ బృందావన సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తి,కార్యదర్శి రాఘవేంద్రరావు, మేనేజర్ నర్సింహ్మచార్, ట్రస్టీలు హరిరావు, ప్రహ్లాదరావు, రాజారావు, గురురాజ్రావు తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.
బర్కత్పుర రాఘవేంద్రస్వామి మఠంలో…
రాఘవేంద్రస్వామి 352వ ఆరాధనోత్సవాలు శనివారం వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు బర్కత్పుర శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ పురానిక్ తెలిపారు. ఆరాధనోత్సవాల సందర్భంగా గురువారం అష్టోత్తర పారాయణ, పాదపూజ, కనకాభిషేకం పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.