మూసాపేట, ఆగస్టు22: మూసాపేట డివిజన్ పరిధి పటేల్‌నగర్(హెచ్‌పీ రోడ్డు) ప్రాంతంలోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో పటేల్‌నగర్ నివాసితులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పటేల్‌నగర్‌లో 50 ఏండ్ల నుంచి పట్టా భూములు కొనుగోలు చేసి నివాసం ఉంటున్న ఇండ్లను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, నిర్మాణ అనుమతులు పొందలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తూము జగదీశ్, తూము మల్లేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, ఆంజనేయులు, రాకేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.