Viral Video | హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై వెళ్తున్న బైక్‌ను ఓ భారీ లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌పై బైకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నెమ్మదిగా నడపాలని లారీ డ్రైవర్‌కు సూచించాడు.
డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన బైకర్ లారీ బ్యానెట్‌పైకి ఎక్కాడు. మరింత ఆగ్రహానికి గురైన డ్రైవర్ లారీని మరింత స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో మరోసారి బైక్‌ను ఢీకొట్టాడు డ్రైవర్. బాధిత యువకుడు లారీ డోర్లో వేలాడుతూ ఉండగా.. వేగంగా రెండు కిలోమీటర్లు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. చివరకు ఓ వెహికల్ అడ్డం రావడంతో లారీని డ్రైవర్ ఆపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.