పీర్జాదిగూడ, జనవరి16: సంక్రాంతి పండుగ రోజు చెంగిచర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కాలనీల్లో అర్ధరాత్రి కత్తులతో తిరుగుతూ ఎనిమిది ఇండ్లల్లో ఇంటి తాళాలు పగుల గొట్టి సుమారు రూ.56 లక్షల బంగారు ఆభరణాలు, రూ 20 లక్షల వెండి వస్తువులతో పాటు రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ సర్కిల్ పరిధి చెంగిచర్ల కనకదుర్గకాలనీ, అనుశక్తినగర్ కాలనీల్లో నివాస ముంటున్న రాజు ఇంట్లో 2 తులాల బం గారు వస్తువులు.
30 తులాల వెండి పస్తువుల రూ.15వేల నగదు.. మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ ఇంట్లో 19 తులాల బంగారు ఆభరణాలు.. నాగేశ్వర్ రా వు ఇంట్లో 2 తులాల బంగారు ఆభరణాలు, 6 కేజీల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, ప్రభుదాస్ ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులు, రూ.15వేల నగదు చోరీ చేశారు. కాలనీల్లో రెక్కీ నిర్వహించి సం క్రాంతి పండుగ రోజు అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లల్లో దూరి చోరీకి పాల్పడ్డారు.
మరుసటి రోజు బాధితులు వచ్చి చూసే సరికి తాళాలు పగుల గొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూసేసరికి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో 8 ఇండ్లల్లో సుమారుగా రూ. 56 లక్షల విలువైన 40 తులాల బంగారు నగలు, రూ.20లక్షల విలువైన 8 కిలోల వెండి వస్తువులు, రూ. 2లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, మేడిపలి సీఐ గోవిందరెడ్డి ఇండ్లను సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
