సిటీబ్యూరో, జూన్11 (నమస్తే తెలంగాణ): నగరంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా సెంట్రల్ యూనివర్సిటీలో 7.0 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా బేగంపేట్లో 2.0 మిల్లీ మీటర్లు నమోదైంది.
రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం గరిష్ఠం 39.8, కనిష్ఠం 26.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.