హైదరాబాద్, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ): యువతే దేశానికి వెన్నెముక, తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తే దేశాభివృద్ధి జరుగుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించిన సమావేశ మందిరాలను వారు సందర్శించారు. అనంతరం శాసనమండలి చైర్మన్‌తో కలిసి ఆ యువకులు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ‘ఇంటర్‌స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్’ కార్యక్రమానికి వారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ముగియడంతో రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ను కలిశారు. మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ..యువత చెడు మార్గంలో నడవకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కార్యక్రమంలో శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.