ఎల్బీనగర్, ఫిబ్రవరి 5 : సాగర్ రోడ్డు సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాగర్ రింగ్‌రోడ్డులో బీఎన్‌రెడ్డినగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్‌లో సుందరమైన మొక్కలతో అందంగా తీర్చిదిద్దే పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ రింగ్‌రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో సెంట్రల్ మీడియన్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అందంగా మారుస్తామని.. ప్రధానంగా రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. రెండు రోజుల్లో సాగర్ రోడ్డు సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ కమిషనర్ పంకజ, ఎస్ఈ అశోక్‌రెడ్డి, సిటీ ప్లానర్ ప్రసాద్‌రావు, హర్టికల్చర్ అధికారి రాజ్‌కుమార్, ఎల్బీనగర్ ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.