Hyderabad | ఎల్బీనగర్.. ఇక శ్రీకాంతాచారి జంక్షన్.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లో 11 అంశాలకు ఆమోదం
Hyderabad | ఎల్బీనగర్ జంక్షన్‌ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.
Hyderabad | సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ఎల్బీనగర్ జంక్షన్‌ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11 అంశాలకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్‌శేఖర్, సయ్యద్ మిన్హాజుద్ధీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తధర్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీత యాదవ్, పండల సతీశ్‌బాబు, ఈఎస్ రాజ్, జితేంద్రనాథ్, టి.మహేశ్వరి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, ఈఎన్సీ జియాఉద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జయరాజ్ కెనడీ, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, సామాట్ అశోక్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆమోదం పొందిన 11 అంశాలివే..
- జూబ్లీహిల్స్ రోడ్ నం.92 నుంచి రోడ్ నం.12 వరకు 18 మీటర్ల లింకు రోడ్డు వెడల్పునకు గానూ 15 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోనున్నారు.
- ఎల్బీనగర్ జంక్షన్‌కు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా, ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ వంతెనకు మాల్ మైసమ్మ ఫ్లైఓవర్‌గా నామకరణం.
- జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-2111 1111 నిర్వహణ జీవీకే ఈఎంఆర్ఐ గడువును 2023 జూన్ 1 నుంచి 2026 మే 31 వరకు మూడేండ్లపాటు పొడిగించారు.
- పేట్బషీరాబాద్లో సీఎస్ఆర్ కింద రోడ్డు నిర్మించేందుకు ముందుకొచ్చిన అపర్ణ కన్స్ట్రక్షన్స్తో కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఎంఓయూ కుదుర్చుకుంటూ ఆమోదం.
- గాజులరామారంలో పెరికి చెరువు కలుషిత నివారణకు గానూ రూ.3కోట్లతో డ్రైనేజీ పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చారు. F ఐఐఐటీ జంక్షన్ నుంచి డీఎల్ఎఫ్ వరకు సెంట్రల్ మీడియన్స్, ట్రాఫిక్ ఐల్యాండ్లను 2026 మే 28 వరకు డీఎల్ఎఫ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద చేపట్టేందుకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు అనుమతి.
- కొండాపూర్ జంక్షన్ నుంచి పోలీస్ కాలనీ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు, సఫారీ నగర్ నుంచి కొండాపూర్ జానీ మజీద్ వయా హెచ్‌టీ లైన్ పోలీస్ గ్రౌండ్ వరకు పొడిగించేందుకు 43 ఆస్తులను సేకరించేందుకు కమిటీ ఆమోదం.
- టీవీ టవర్ జంక్షన్ మూసారాంబాగ్ నుంచి అలీకేఫ్ జంక్షన్ 1.4 కిలోమీటర్ల పొడవులో 48 మీటర్ల వెడల్పు, మూసీ రివర్ అంబర్పేట్ కాజ్వే 48 మీటర్ల వెడల్పునకు 109 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం. F టీకేఆర్ కమాన్ నుంచి నాగార్జునసాగర్ రోడ్ వయా జెడ్పీ రోడ్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 282 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం. F సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్లో ధనియాలగుట్ట(గ్రేవ్ యార్డ్)ను ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు మహాప్రస్థానం ట్రస్టుకు ఐదేండ్లపాటు సీఎస్ఆర్ కింద నిర్వహించేందుకు కమిటీ ఆమోదం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

