కొడంగల్: రైతులు చేపట్టిన న్యాయపోరాటాన్ని రాజకీయ కక్షగా మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు రాంచందర్, లక్ష్మణ్, శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను సోమవారం కోర్టులో హాజరు పర్చిన సందర్భంగా వారు మా ట్లాడారు.
లగచర్ల కేసును ఎన్నో మలుపులు తిప్పేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని.. అందువల్లే పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ రావడంలో ఆల స్యమవుతున్నదన్నారు. కస్టడీలో పోలీసులు ఘటనకు సంబంధం లేని ప్రశ్నలతో ఆయన్ను ఇబ్బందికి గురి చేశారని..ఆ కేసులో ఇరికించేలా వ్యవహరించారన్నారు. ఈ విషయాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మాజీ ఎమ్మెల్యే పోలీసులకు ఎటువంటి కఫెక్షన్ ఇవ్వలేదన్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం న్యాయవాదులకు చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కోర్టులో హాజరు పర్చడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు.
నరేందర్‌రెడ్డితో పాటు 71 మందిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. 20 రోజులు దాటినా అరస్టైన వారికి బెయిల్ మంజూరు కావడం లేదన్నారు. ఫార్మాను ప్రభుత్వం విరమించుకున్నప్పుడు రైతులు, ప్రజలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఫార్మాను రద్దు చేసిన మాదిరిగానే లగచర్ల కేసును రద్దు చేసి చేయాల న్నారు. మాజీ ఎమ్మెల్యే నిర్దోషిగా బయటికి వస్తారని న్యాయవాదులు స్పష్టం చేశారు.
లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీ అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు రెండు రోజులుగా ఆయన్ను వికారాబాద్‌లో విచారించారు. సోమవారం జైలుకు తరలించే ముందు స్థానిక ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈనెల 13వ తేదీ వరకు రిమాండ్‌లో భాగంగా పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యేను చూ సేందుకు బీఆర్ఎస్ నాయకులు కోర్టు ముందు పడిగాపులు కాసినా ఏ ఒక్కరినీ అనుమతించలేదు.