ఎలివేటెడ్ బాధితులకు భరోసా ఏదీ?
మహానగరంలో అభివృద్ధి పేరిట సాగుతున్న తంతు సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ బాధితుల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. కష్టమొచ్చి కన్నీరు పెట్టుకుంటున్న బాధితులను కలిసేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తిగా విముఖత చూపుతున్నారు. బాధితుల ఆందోళనపై ఎలాంటి దృష్టి పెట్టకుండా... కేవలం భూములు తీసుకోవడమే లక్ష్యంగా అధికారుల తీరు ఏకపక్షంగా మారుతోందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ముఖం చాటేస్తున్న కమిషనర్
- ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో భూ యజమానులకు అన్యాయం
- భూములు గుంజుకోవడమే లక్ష్యంగా అడుగులు
సిటీబ్యూరో, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ) : మహానగరంలో అభివృద్ధి పేరిట సాగుతున్న తంతు సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ బాధితుల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. కష్టమొచ్చి కన్నీరు పెట్టుకుంటున్న బాధితులను కలిసేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తిగా విముఖత చూపుతున్నారు. బాధితుల ఆందోళనపై ఎలాంటి దృష్టి పెట్టకుండా… కేవలం భూములు తీసుకోవడమే లక్ష్యంగా అధికారుల తీరు ఏకపక్షంగా మారుతోందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ రహదారి తదితర ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల పేరుతో అధికారులు సాగిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా మారింది. తిరుమలగిరి, తోకట్ట, కాకగూడ, మచ్చాబొల్లారం తదితర ప్రాంతాల పరిధిలో వందలాది మంది భూ యజమానులు, స్థానికులు తీవ్ర భయాందోళనలో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు బాధితులు తమ గోడును వెళ్లబోసుకునేందుకు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తే.. హెచ్ఎండీఏ కమిషనర్ ముఖం చాటేస్తున్నారు. కలిసేందుకు కూడా వారు విముఖత చూపుతుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు దికుతోచని స్థితిలో పడ్డారు.
భూములు గుంజుకోవడమే టార్గెట్..
ప్రజా సమస్యల పరిషారంపై, బాధితుల ఆందోళనలపై ఏమాత్రం దృష్టి పెట్టని సరార్.. కేవలం భూములు బలవంతంగా లాకోవడమే టార్గెట్‌గా వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఎంత ఇస్తారో స్పష్టత ఇవ్వకుండా, అడ్డగోలుగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాక, న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కేసులు వెనకి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.
బతుకులు రోడ్డుపాలు..
‘అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులను బలిపెట్టి చేసే అభివృద్ధి మాకెందుకు?’ అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తలదాచుకునే ఇళ్లను, తరతరాలుగా జీవనం సాగిస్తున్న భూములను బలవంతంగా లాకుంటే కనీసం న్యాయమైన పరిహారం గురించి మాట్లాడే నాథుడే కరువయ్యాడు. హెచ్ఎండీఏ కమిషనర్, ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల అండతో ప్రజా గొంతుకను అణచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని రాజీవ్ రహదారి జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీశ్ హెచ్చరించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు బాధితులతో చర్చలు జరపాలని, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

