
హైదరాబాద్: ఓల్డ్ అల్వాల్‌లోని శివనగర్ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం లక్ష పుష్ఫాభిషేకం ఘనంగా నిర్వహించారు.

శివునికి అత్యంత ప్రీతికరమైన శ్రావణమాస రెండో సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం, బిల్వార్చన చేశారు.

భక్తుల యోగక్షేమాలు కోరుతూ లక్ష పుష్ఫాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొడారి నర్సింగారావు, ప్రధానార్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ తెలిపారు.

శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు