సిటీబ్యూరో, అగస్టు 14(నమస్తే తెలంగాణ): ట్యాంక్‌బండ్ వద్ద లేక్ పోలీసులు పటిష్టమైన విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ అంజనీకుమార్ ప్రశంసించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 300 మంది ప్రాణాలను కాపాడారంటూ..సిబ్బందిని అభినందించారు. శనివారం లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్ బి.ధనలక్ష్మి, కానిస్టేబుల్స్ అభిలాశ్యాదవ్, రాజు, నవీన్‌కుమార్, హోంగార్డులు కృష్ణా యాదవ్, యాదగిరి, సయ్యద్ దావూద్, ఇమామ్ భాషా, అశోక్‌గౌడ్ తదితర సిబ్బందికి జ్ఞాపికలు అందించారు.