చిక్కడపల్లి, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో కార్మిక వర్గానికి ఉపాధి భరోసా పెరిగిందని కనీస వేతనాల సలహాల మండలి చైర్మన్ పి.నారాయణ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మిక శాఖ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి రెండవ సమావేశాన్ని చైర్మన్ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ పక్షపాతి ముఖ్యమంత్రికేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో వివిధ షెడ్యూల్లో పని చేసే కార్మికులకు కనీస వేతనాలు జీవోలు సవరించి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు, ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండలి కార్యదర్శి శ్యాంసుందర్ జాజు, సభ్యులు నిరంజన్‌రావు, దుర్గా ప్రసాద్, చేతన్, మంచె నరసింహ, శివశంకర్, నర్సయ్య, శంకర్ రెడ్డి, మల్లికార్జున్ అధికారులు బసిరెడ్డి తదితరులు హాజరయ్యారు.