మాదన్నపేట, జూలై 9: హైదరాబాద్ కుర్మగూడలో శ్రీ మహంకాళి రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ (మూడుగుళ్ల) ఆలయాల19వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు వివిధ రకాల పూలతో అమ్మవార్లను అలంకరించి ఉదయం 4 గంటల ప్రధాన అర్చకురాలు శ్రీదేవి చండిహోమం తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, కొత్తకాపు రవీందర్ రెడ్డి పాల్గొన్ని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ , సహదేవ్ యాదవ్, సభ్యులు వెంకట్రెడ్డి ,బర్ల శ్రవణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, దౌల్తాబాద్ లక్షీకాంత్, తదితరులు పాల్గొన్నారు.