న్యాయవాది కుటుంబానికి పరామర్శ
మాసబ్ ట్యాంకులో ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబసభ్యులను శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : మాసబ్ ట్యాంకులో ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబసభ్యులను శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలకపాత్ర పోషించే న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం అత్యంత విచారకరమన్నారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన..
ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ
జరిపించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని సాయికిరణ్ యాదవ్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

