జూబ్లీహిల్స్,జూన్ 25 : ప్రజాసేవకు కొత్త భాష్యం చెప్పిన మహనీయుడు మాగంటి గోపీనాథ్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
గురువారం యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లోని శౌర్య కన్వెన్షన్‌లో దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి నివాళులర్పించారు.