ఖైరతాబాద్/కవాడిగూడ: పీజేఆర్ మహానాయకుడు, మాస్ లీడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆదివారం దివంగత ప్రజా నేత జనార్దన్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ కూడలిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు సీహెచ్ మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.
కార్పొరేటర్లు వెల్దండ వెంకటేశ్, దేదీప్య రావు, రాజ్ కుమార్ పటేల్, ప్రభుదాస్, దేవేందర్‌రెడ్డి, సాయిజెన్ శేఖర్, రాసూరి సునీత, శాంతి, సామల హేమ, గ్రంథాలయ సంస్థ హైదరాబాద్ జిల్లా మాజీ చైర్పర్సన్ ప్రసన్నా రామ్మూర్తి, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మహేశ్ యాదవ్, గజ్జెల ఆనంద్, ఎస్కే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దోమలగూడలోని తన నివాసంలో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. పీజేఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.