ఇటీవల విడుదలైన టీజీఎప్‌సెట్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన ఉప్పల్‌కు చెందిన ఎం.రుషి అనే విద్యార్థినిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.
కాగా, రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఇటీవల నిర్వహించిన టీజీఎప్‌సెట్ పరీక్షా ఫలితాల్లో రుషి 160 మార్కులకుగానూ 156.63 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది.

Ktr Rishi1