కుత్బుల్లాపూర్, మే11: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ ఫామ్ గ్రోవ్‌లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫామ్ గ్రోవ్‌లో అధికారులతో కలిసి కాలనీలో మురుగునీటి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపర్ణ ఫామ్ గ్రోవ్‌లో మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టి శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.
మౌళిక వసతుల కల్పనలో భాగంగా మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణా రెడ్డి, కొంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీధర్, ఇరిగేషన్ అధికారులు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వినోద్, డప్పు కిరణ్, పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సంగీతా రెడ్డి, సీనియర్ నాయకులు షన్ను, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.