నగరంలో అనువైన ప్రయాణానికి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. శేరిలింగంపల్లిలోని కొత్తగూడ వద్ద నిర్మితమవుతున్న పై వంతెనను, అండర్‌పాస్‌ను జనవరి మొదటివారంలోనే ప్రారంభించి నగరవాసులకు నూత న సంవత్సర కానుకగా అందించనున్నారు. ఎస్సార్డీపీ చేపట్టిన 47 పనుల్లో ఇప్పటికే 33 పూర్తయ్యాయి. ఇది 34వది. 263 కోట్ల రూపాయలతో నిర్మించిన 18వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద వాహనదారులకు ఊరట లభించనుంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ) : గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిషారానికి రూ.263 కోట్ల అంచనా వ్యయంతో 3 కిలోమీటర్ల మేర కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను బల్దియా నిర్మించింది. నూతన సంవత్సరం కానుకగా వచ్చే నెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్‌కు అనుబంధంగా 470 మీటర్ల పొడవుతో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్‌ను కూడా చేపట్టి అధికారులు పూర్తి చేశారు. ఇందులో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్ బాక్స్ 425 మీటర్ల ఓపెన్ బాక్స్ గల అండర్ పాస్ చేపట్టామని వివరించారు. కాగా కొత్తగూడ ఫ్లై ఓవర్ వల్ల గచ్చిబౌలి, కొండాపూర్ వాసులు ప్రయోజనం పొందుతారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఈ వంతెన వల్ల బొటానికల్ గార్డెన్, కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిషారం అవడమే కాకుండా కొండాపూర్ జంక్షన్లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
ట్రాఫిక్ సమస్యలు దూరం..
జీహెచ్ఎంసీ పరిధిలో నివాసితులు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్వోబీలను వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం కింద చేపడుతున్నారు. సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థకు చేపట్టిన ఎస్ఆర్డీపీ పథకాలు ఒకొకటి ప్రజలకు అందుబాటులోకి రావడంతో చేరవలసిన గమ్యస్థానానికి సకాలంలో సురక్షితంగా చేరుతారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం 41 పనులను చేపట్టగా అందులో 30 పనులు పూర్తయ్యాయి. ఇతర శాఖలకు సంబంధించిన 6 పనుల్లో 3 పనులు అందుబాటులోకి రాగా చేపట్టిన మొత్తం పనుల్లో 33 పూర్తయ్యాయి. అందులో 17 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మిగతా పనులు అండర్ పాసులు, ఆర్వోబీలు, ఇతర రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేశారు. గచ్చిబౌలి ప్రాంతంలో చేపట్టిన కొత్తగూడ ఫ్లై ఓవర్ నగరంలో 18వ ఫ్లై ఓవర్, ఈ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది.